YSR సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలు
సెప్టెంబర్ 7, 2020న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్-సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్ఆర్-సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించారు. రాష్ట్రంలో రక్త హీనత, పౌష్టిక ఆహార లేమి పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్నిప్రారంభించారు. ప్రతి సంవత్సరం సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ఈ సంవత్సరం సుమారు రూ.2,300 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. పౌష్టికాహారాన్ని అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఒక్కొక్కరికీ రూ.850 చొప్పున ఖర్చు చేస్తుండగా సంపూర్ణ పోషణ ప్లస్ కోసం రూ.1,150 చొప్పున వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కధనంలో YSR సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కార్యక్రమ వివరాలు అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
YSR సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకం లక్ష్యాలు
- ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం రాష్ట్రంలోని గిరిజన సమాజానికి చెందిన పిల్లల పోషకాహార లోపంతో పాటు గర్భిణీ మరియు బాలింతలలో రక్తహీనతను పరిష్కరించడం.
- అత్యంత బలహీనమైన మహిళలకు మరింత పౌష్టిక ఆహారాన్ని అందించడం.
- రాష్ట్రంలోని పేద మహిళల ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి మరియు నవజాత శిశువులు మరియు మాతాశిశు మరణాల రేటును తగ్గించడం
YSR-సంపూర్ణ పోషణ పథకం
77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాలలోని గర్భిణులు, బాలింతలకు నెలకు హోమ్ న్యూట్రిషన్ కిట్‌ను అందజేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్ సరుకులు దిగువన ఇచ్చాము
- 2 కిలోలు రాగి పిండి
- 1 కేజీ అటుకులు
- 250 గ్రాముల బెల్లం
- 250 గ్రాముల చిక్కీ
- 250 గ్రాముల ఎండు ఖర్జూరం
- 3 కేజీల బియ్యం
- 1 కేజీ పప్పు
- అర లీటర్ వంటనూనె
- 25 గుడ్లు
- 5 లీటర్ల పాలు
YSR-సంపూర్ణ పోషణ ప్లస్ పథకం
రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్ మండలాల్లోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. 66,000 మంది గర్భిణులు మరియు బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పులు, కూరగాయలు లేదా ఆకుకూరలు మరియు గుడ్లు అందజేస్తారు. టేక్ హోమ్ న్యూట్రిషన్ కిట్ లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి నెలకు రూ.1100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో నెలకు అందే రేషన్ సరుకులు దిగువన అందించాము.
- 1 కేజీ రాగి పిండి
- 2 కిలోలు మల్టీ గ్రెయిన్ ఆటా
- 500 గ్రాముల బెల్లం
- 500 గ్రాముల చిక్కీ
- 500 గ్రాముల ఎండు ఖర్జూరం
- 3 కేజీల బియ్యం
- 1 కేజీ పప్పు
- అర లీటరు వంటనూనె
- 25 గుడ్లు
- 5 లీటర్ల పాలు
గుంటూరు మిర్చి కి అంతర్జాతీయ గుర్తింపు
ఆరోగ్యవంతమైన భావి తరాల కోసం YSR సంపూర్ణ పోషణ
ఆరోగ్యవంతమైన భావి తరాల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్నిఅందిస్తున్నారు. తద్వారా భావి తరాలను ఆరోగ్యవంతం చేయవచ్చు.
అంగన్‌వాడీ కేంద్రాల పై దృష్టి
అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన టాయిలెట్లు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. క్రమంగా అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు మరియు ఫౌండేషన్ స్కూల్‌లో చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని, ఫౌండేషన్ స్కూల్ చిన్నారులకు విద్యా బోధనలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఇంగ్లీషు భాషలో పరిజ్ఞానం, ఉచ్ఛారణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు
ఫ్యామిలీ డాక్టర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలని ఆదేశించారు. పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యాన్ని పరిశీలించి ఏమైనా సమస్యలుంటే మంచి వైద్యాన్ని అందించాలని సూచించారు. అక్షరాస్యత పెంపు, బాల్య వివాహాల నిరోధం, బాలికలు ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించే లక్ష్యంతో తెచ్చిన తీసుకొచ్చిన పథకాలు ఎలా ఉపయోగపడతాయో అవగాహన కల్పించాలన్నారు.
ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది
YSR సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకం యొక్క ప్రయోజనాలు
- గర్భిణులు, తల్లులు మరియు వారి పిల్లల నుండి పోషకాహార లోపం యొక్క ప్రభావాలను పర్యవేక్షించడానికి ఈ పథకం సహాయపడుతుంది.
- లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే సంపూర్ణ భోజనం అందుతుంది.
- అర్హులైన మహిళలకు నెలవారీ టేక్ హోమ్ రేషన్ అందజేస్తారు.
- అంగన్‌వాడీలలో పిల్లలకు ఆంగ్లంలో విద్య మరియు చదువుకునే సౌకర్యాలు ఉన్నాయి
- AWCలో పిల్లలు మరియు మహిళలు క్రమం తప్పకుండా బరువు మరియు వారి ఆరోగ్యాన్ని తనిఖీ చేస్తారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |