loఈ బ్యాచ్ లో TS TET 2023 పూర్తి పేపర్-1 & 2 CDP/Psychology (శిశు వికాసం మరియు బోధనా పద్దతులు) సిలబస్ ని బేసిక్ నుండి పరీక్షకు ఉపయోగపడే విధంగా సిలబస్ లో పొందుపరిచినా అన్ని టాపిక్స్ ని పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ బ్యాచ్ లో ఇచ్చే అన్ని క్లాసులను స్టడీ ప్లాన్ ప్రకారం మీరు పూర్తి చేయగలిగితే టెట్ లో మంచి స్కోర్ సాధించవచ్చు తద్వారా TRT/DSC లో మంచి మార్కులు అదనంగా కలుస్తాయి, కావున మీరు టీచర్ అవ్వాలనే కోరిక నెరవేరుతుంది.... ఈ సరి TRT/DSC లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఈ బ్యాచ్ ద్వారా సులభం అవుతుంది.
TS TET పరీక్షా విధానం 2023
TSTET 2023 పరీక్షలో పాఠశాల విద్య యొక్క వివిధ స్థాయిలలో ఉపాధ్యాయులను నియమించడానికి రెండు పేపర్లు ఉంటాయి:
TSTET పేపర్-I (ప్రైమరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థుల కోసం, అంటే క్లాస్ I-V నుండి.)
TSTET పేపర్-II (సెకండరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థులకు, అంటే క్లాస్ VI-VIII)
అభ్యర్థులు అర్హత ప్రమాణాలను బట్టి పేపర్-I లేదా పేపర్-II లేదా రెండు పేపర్‌లకు హాజరుకావచ్చు. ప్రశ్నపత్రం ఎంచుకున్న భాష I మరియు ఆంగ్లంలో ప్రశ్నలతో కూడిన ద్విభాషా విధానంలో రూపొందించబడింది.
TS TET 2023 పేపర్ I – పరీక్షా విధానం
TSTET పేపర్-I (ప్రైమరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థుల కోసం, అంటే క్లాస్ I-V నుండి.) లో శిశు వికాసం మరియు బోధనా పద్దతులు, లాంగ్వేజ్- II ఇంగ్లీష్, లాంగ్వేజ్- I, గణితం, పర్యావరణ అధ్యయనాలు అంశాలు ఉంటాయి.